Black Fungus కంటే ప్రమాదకరం White Fungus, Oxygen నిర్లక్ష్యం | Who Are At Risk?| Oneindia Telugu

2021-05-21 531

After Black Fungus, 'more dangerous' White Fungus reported in Patna - Who are at high risk of infection?
#BlackFungusSymptoms
#WhiteFungus
#WhiteFungushighriskofinfection
#Oxygen
#AmphotericinB
#MucormycosisSymptoms
#COVID19inducedBlackFungus
#Coronavirus inindia
#CovidVaccination
#IndiaOxygenSupply
#Hospitalbeds
#Coronapatients

కరోనా నుంచి కోలుకుంటున్నవారికి ఇప్పుడు బ్లాక్ ఫంగస్ రూపంలో మరో ముప్పు దాపురించింది. అయితే, తాజాగా, మరో ముప్పు వెలుగుచూసింది. బీహార్ రాష్ట్రంలో కొత్తగా వైట్ ఫంగస్ కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. అంతేగాక, బ్లాక్ ఫంగస్ కంటే వైట్ ఫంగస్ మరింత ప్రమాదకరమైనదని వైద్య నిపుణులు చెబుతుండటంతో మరింత ఆందోళన నెలకొంది.పాట్నాలో కరోనా లక్షణాలతో వచ్చిన రోగులకు టెస్ట్ చేయగా కరోనా నెగిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అయితే, అనుమానంతో మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించడంతో వైట్ ఫంగస్ వచ్చినట్లు తేలింది. ఈ మేరకు పాట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రి మైక్రోబయాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ ఎస్ఎస్ సింగ్ వెల్లడించారు. ఇప్పటి వరకు నలుగురికి వైట్ ఫంగస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని, ఇలాంటి కేసులు మరిన్ని వెలుగుచూసే అవకాశం ఉందని డాక్టర్ సింగ్ తెలిపారు.